Saturday, March 14, 2020

Video Footage Exposed YSRCP Drama, Amaravathi, Andhra Pradesh | నిన్న యాక్సిడెంట్ కథ అల్లి అడ్డంగా దొరికిపోయారు.. ఇప్పుడు వీడియో సాక్ష్యం.. ఇంకెన్నాళ్ళు ఈ డ్రామాలు?


Video Footage Exposed YSRCP Drama, Amaravathi, Andhra Pradesh | నిన్న యాక్సిడెంట్ కథ అల్లి అడ్డంగా దొరికిపోయారు.. ఇప్పుడు వీడియో సాక్ష్యం.. ఇంకెన్నాళ్ళు ఈ డ్రామాలు?
Video Footage Exposed YSRCP Drama

29 comments:

 1. ఇంట్లో సీసీటీవీ సరంజామా అమర్చుకున్న ధనికుడికి సెక్యూరిటీ గార్డు పెట్టుకునేంత డబ్బులు లేవా?

  ReplyDelete
  Replies
  1. మా ఇంటిముందూ సీసీటీవీ ఉంది కాని సెక్యూరిటీ గార్డు లేడు.
   గార్డుని పెట్టుకోవడం పెట్టుకోకపోవడం అతనిష్టం. సంబంధం లేనివాడికెందుకో ఇంత గుల!

   Delete
  2. గుమ్మడి కాయల దొంగంటే భుజం తముడుకోవడం ఎందుకు, మీదీ తెనాలేనా కొంపతీసి?

   సదరు తెనాలి తెగులు తమ్ముడి ఇంట్లో ఇంటి ముందు మాత్రమే కాదు ఇంకొన్ని కెమెరాలు ఉన్నాయి(ట), బోలెడంత వీడియో ఫుటేజీ రిలీస్ చేసాడు(ట). వ్యక్తిగత భద్రత మీద అంత సోయి ఉన్నోడికి గుర్ఖా పెట్టుకోవడం కష్టమా.

   గ్రాఫిక్కులు ఆరితేరిన మాలోకాలను నమ్మడం (మానసిక) ఆరోగ్యానికి హానికరం.

   Delete
  3. పలానా పార్టీవాడు చేసే పనులన్నీ పవిత్ర కార్యక్రమాలు, వేరే పార్టీవాడైతే చెప్పేవన్నీ అబద్ధాలు (చట్టం ఇంకా తన పని చేయకుండానే) అని ముందే డిసైడైపోవడం ఒక మానసిక రోగం.
   ఆ మధ్య నిర్భయ అత్యాచారం విషయంలో ఒక నాయకుడు "ఆడపిల్లలకు రాత్రిళ్లు బయటకు వెళ్లాల్సిన అవసరం ఏముంది" అని అసందర్భ ప్రేలాపన చేసాడు.
   ఇవాళ గొట్టిముక్కల రాసిన కామెంట్ కూడా అంతే దరిద్రంగా ఉంది.

   Delete
 2. This comment has been removed by the author.

  ReplyDelete
  Replies
  1. https://twitter.com/ncbn/status/1238439445096849409

   అతను భర్త లేని ఆడది కాదండీ, తెనాలి నగరం నడిబొడ్డులో మూడు అంతస్థుల భవనం యజమాని. ఇంతకీ సీసాలు బోండా ఉమా గారు మెచ్చిన బ్రాండులో కాదో. అసలు రాద్ధాంతం అందుకే అయుండొచ్చు!

   Delete
 3. ఈరోజుల్లో ఏసీలు, సీసీటీవీలు, ఇన్వెర్టర్లు,ఫేస్ బుక్కులూ, వాట్స్ ఆప్ లు పల్లెటూర్లలో ప్రతి ఇంట్లోనూ ఉంటున్నాయి.వాళ్ళంతా ధనికులే ఆరోగ్యశ్రీ కూడా తీసుకుంటున్నారు.

  ReplyDelete
 4. @ జై,

  సీసీటీవీ 25000 రూపాయలకే పెట్టుకోవచ్చు. సెక్యూరిటీ గార్డుని పెట్టుకోవాలంటే నెలకి 25 వేలు ఇవ్వాలి. భర్తలేని ఆడవాళ్ళు సెక్యూరిటీ గార్డుని పెట్టుకోడానికి భయపడతారు.మీ తెలంగాణావాళ్ళకు అంత సోయ ఉంటే ఇంత బాధ ఎందుకు ?

  ReplyDelete
 5. తెలంగాణ జైగారికి కేసీయార్ మందు గొడితే ఈయనకు బుర్ర పని చేయడం లేదేమో?
  ఇంటి ముందు సిసి కెమేరా ఉంటే గుర్ఖాను పెట్టుకుని నెలకు ఐదారు వేలు జీతం ఇచ్చేంత ఆర్ధిక స్థితి ఉన్నట్టేనా?
  కొంతమంది కేవలం సిసి కెమేరా మాత్రమే పెట్టుకుంటారు తప్ప గుర్ఖాలను పెట్టుకోరు.
  అయినా అసలు విషయం పక్కన బెట్టి గుర్ఖాల గురించి వాదన ఏమిటి?
  ఈయన తెలంగాణ వాడు అయిపోయాడు గాని ఇక్కడ ఆంధ్రావాడైయుంటే వైసీపీ కండువా మొలకు చుట్టుకుని రౌడీలా తిరిగేవాడు. అబద్ధాల పుట్ట పార్టీని నమ్ముతున్నాడు కాబట్టే ఇటువంటి తలతిక్క మాటలు (కామెంట్లు)వాదులుతున్నాడు. గ్రాఫిక్కులు, గ్రాఫిక్కులు ఎవడో బొక్కలోగాడు చెపితే అది నమ్మి మాటిమాటికి వాగడానికి జైగారికి సిగ్గూ,శరం లేకుండా పోయింది. ఈయన ముమ్మాటికి అమరావతి శ్మశానం, ఆంధ్రా అంధకారం కావాలని కోరుకునే భయంకరమైన ఆంధ్రా ద్వేషి.

  ReplyDelete
  Replies
  1. మొన్నటిదాకా "ఏయ్ జగన్, నీకు దమ్ముంటే ఎన్నికలు పెట్టు" అని రంకెలేస్తూ తెగ బిల్డప్పులు ఇచ్చారు. ఇప్పుడు తీరపోసి ఎన్నికలు వచ్చాక రాబోయే పరాభవానికి సాకులు వెతుక్కునే ప్రహసనానికి తెర తీస్తున్నారు.

   భ్రమరావతి ఆపిల్ వాచీ పైడ్ ఆర్టిస్టుల ఎపిసోడ్ ముగిసింది. ఇప్పుడు తాజాగా పచ్చకామెర్ల మీడియాకు ఎదో ఒక కామెడీ షో కావాలి :)

   Delete
  2. అమరావతి రైతుల పట్ల ఇటువంటి వాగుడు వాగినందుకే జోకర్ ఫృధ్వీ గాడికి చెప్పుతో వాయించుకుని బయటకి గెంటేచేయించుకున్నాడు.

   "తన గవర్నమెంట్ ను రద్దు చేయించుకుని ఎలక్షన్స్ కి వెళ్లమను.. అప్పుడు కనిపిస్తుంది నిజమైన బొమ్మ వైసీపీకి" ఆంధ్రా వాళ్లు ఇంకా గ్రుడ్డిగా నమ్ముతున్నారనుకుంటున్నారా వైసీపీ వాళ్ల మాయ కబుర్లను.... తమరు ఇక కళ్ళు తెరవండి భ్రమలో నుండి..జైగారు.

   Delete
  3. బలిరెడ్డి (అతని ఇంటిపేరు లెండి, తోక కనిపించి కదాని గంతులొద్దు) పృథ్వి నిష్క్రమణ కారణం ఆడియో కలకలమన్న వాస్తవం నాకూ మీకూ ఇద్దరికీ తెలుసు.

   చంద్రాలు సార్ ఐదేండ్లలో (కాకినాడ మినహా) స్థానిక ఎన్నికలు జరిపే సాహసం చేయలేదు. జగన్ వచ్చాక ఎన్నికలు జరక్కుండా ఎవరు అడ్డు పడుతున్నారో తెలుసునే ఉంది.

   పోనీ "దుష్ట దుర్మార్గ నీచ కమీనే కుత్తే జగన్ అంటే ఆంధ్రా జనానికి మొహం మొత్తింది" అనుకుంటే విశాఖ తూర్పులో ఉప-ఎన్నికకు సిద్ధం కావొచ్చు కదా. సార్వత్రిక ఎన్నికలలో పాతిక వేలకు మించిన మెజారిటీ సాధించిన వెలగపూడి రామకృష్ణ బాబు రాజీనామా లేఖ స్పీకర్ మొఖాన కొడితే పొద్ది. ఎంవీపీ కాలనీ సెంటర్లో "విశాఖ రాజధాని వద్దు, భ్రమరావతి ముద్దు" నినాదం మారు మోగకపోతే గీతం మూర్తి మీద ఒట్టు!

   Delete
 6. జై గారూ,
  మీకీ ఆపిల్ వాచ్ obsession ఏమిటి ? ఈ రోజుల్లో ఈ వాచ్ ఏమీ అపురూపం కాదు. పైన నీహారిక గారు కరక్ట్ గా అన్నట్లు చాలా devices, gadgets పల్లెటూళ్ళల్లో కూడా ఉంటున్నాయి. కొంతమంది ఆపిల్ వాచ్ పెట్టుకున్నంత మాత్రాన్న వాళ్ళు సోకాల్డ్ “పెయిడ్ ఆర్టిస్టులు” అవనక్కరలేదు, బాధితులు కాకపోయుండనవసరమూ లేదు.

  “30 years industry” పృథ్వీ ఆ మధ్య టీవీలో అన్నాడు లెండి .... రైతులంటే మోకాలు లోతు బురదలో ఉంటారు గానీ ఇలా ఉండరు, కాబట్టి వీళ్ళు “పెయిడ్ ఆర్టిస్టు”లే గానీ బాధితులు కాదు .... లాంటి మాటలేవో అన్నాడు లెండి. అంటే ఆందోళన చెయ్యడానికి వచ్చినప్పుడు కూడా రైతులు బురదతో నిండిన మోకాళ్ళతోనే వస్తారా? ఏదన్నా పెళ్ళిలో అటువంటి పల్లెటూరు రైతులు అతిధులుగా కనిపిస్తే ... ఠాట్, వీళ్ళ కాళ్లకు బురద లేదు కాబట్టి వీళ్ళు పల్లెల వాళ్ళు కాదు, “పెయిడ్ ఆర్టిస్టుల”ను తీసుకెచ్చి అతిధుల్లాగా కూర్చోబెట్టారు ... అన్నా అంటాడేమో?🤔

  ఆపిల్ వాచ్ అంటూ మీలాంటి విద్యాధికులు, ఆలోచనాపరులు కూడా ఆ ధోరణిలో ఇరుక్కోవద్దు. ఆ ప్రాంతాలు సారవంతమైనవి, కావాలంటే ఆపిల్ వాచ్ కొనుక్కోలేకపోరు, లేదా వాళ్ళ పిల్లలు చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నట్లయితే (కొండొకచో విదేశాల్లో .... ఈ రోజుల్లో అదేం పెద్ద విషయం కాదు కదా) తమ తల్లిదండ్రులకు ఆ మాత్రం ఆ రకం వాచ్ కొనివ్వకపోలేరు.

  ఆందోళన చేస్తున్న వారి పట్ల empathy చూపించగలిగితే హర్షిస్తారు.

  ReplyDelete
  Replies
  1. విన్నకోట వారూ,

   ఆ ప్రాంతంలో మీ అంత కాకపోయినా నేనూ తిరిగాను. కాస్తో కూస్తో అవగాహన నాకూ ఉంది. మీరు చూసారో లేదో తెలీని దళితవాడలు కూడా కొంత పరిచయమే. పెద్దలు నాదెండ్ల వారి సొంతూరు వెళ్లే భాగ్యం కూడా దొరికింది. నరుకులపాడు చెంచుల ఊచకోత రుధిర క్షేత్రం ఎక్కడుందో నా కూడా వచ్చిన స్థానికులకు తెలువక మిస్ అవడం ఒక్కటే దురదృష్టం.

   గాడ్జెట్లు పల్లెటూళ్లలో సైతం సర్వసాధారణం అన్న విషయం తెలీకే కాబోలు బుద్ధా వెంకన్న ఇంకా నోకియా ఫోను వాడుతున్నాడు! అతనిది బెజవాడ నగరం, పైగా "రైతు" కూడా కాదంటారా అయితే వాకే.

   థర్టీ ఇయర్స్ పృథ్వి ఏమన్నాడు, దానిపై మెంటల్ కృష్ణ స్పందన ఏమిటి, సాటి కులకాంత నల్లమోతు దీప్తిపై ఎవరు ఎందుకు దాడి చేసారు వగైరాలు పాత చర్చలే కనుక ప్రస్తుతానికి వదిలేద్దాం.

   ఎడమ చేతికికి ఆపిల్ వాచీ కట్టుకొని, కుడి చేతిలో ప్లాటినం గాజు వేసుకొని, చేతిలో ఐఫోన్ పట్టుకొని బెంజ్ సర్కిల్ ప్రాంతంలో మూడంతస్థుల ఏసీ మేడ లిఫ్టు దిగి ఆడీ కారు వెనుక సీటులో దర్జాగా కాలు మీద కాలేసుకుని అలా "కారులో షికారుకు వెళ్తూ" జన్మకో శివరాత్రి పూట పొలం గట్ల
   ఓ రౌండు కొట్టి పనిదొంగ పాలేరు వెధవలను కేకేసే లలనామణులు కూడా భారతీయులే.

   ఎక్కడో విదేశాలలో రొచ్చుతూ రొప్పుతూ అష్టకష్టాలు పడుతూ "క్రెడిట్ కార్డులు తీసుకొని దాచుకున్న ప్రతి పైసాను" తీసుకొచ్చి "అభివృద్ధి" లో భాగస్వాములు కావాలని "గ్రీన్ కార్డు ల కోసం కళ్ళు కాచేదాకా ఎదురు చూడకుండా" ఉవ్విళ్లూరే ధన్యజీవులు కూడా మనుషులే.

   తమ రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ వెంచర్ ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నారు, అది వారి ఇష్టం. వాళ్ళ వెంబడి ఉపరాష్ట్రపతులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, మాజీ సీఎంలు, ఎంపీలు, పత్రికాధినేతలు, సినిమా(య) పెద్దలు, దేశ విదేశ తందానా సభాధిపతులు, మహా మహా మతపెద్దలు, బడా పారిశ్రామిక వేత్తలు, పేద్ద అధికారులు ఇట్లా ఎందరెందరో అతిరధ మహారధులు ఉన్నారు. నా లాంటి ఒక అర్భకుడి సానుభూతి & సహానుభూతి లేకుంటే ఆ బలవంతులకు చీమ కుట్టినంత కూడా కాదు. నా సింపతీ & ఎంపతీ బడా భూస్వాములకు & మూడు పంటల మాగాణి కామందులకు ధారపోసేంత త్యాగనిరతి లేనందుకు ఈ అల్పుడిని మన్నించండి.

   చచ్చి ఏ లోకాన ఉన్నాడా, మహానుభావుడు కొసరాజు రాఘవయ్య చౌదరి ఎప్పుడో అన్నాడు:

   "పొలాలమ్ముకొని పోయేవారు
   టౌనులో మేడలు కట్టేవారు
   బాంకులో డబ్బులు దాచేవారు
   వళ్ళు వంచి చాకిరికి మళ్లరు"

   అసొంటి వారి జట్టులో నేను చేరలేదు, చేరను, చేరలేను.

   Delete
 7. This comment has been removed by the author.

  ReplyDelete
 8. విన్నకోట వారూ,
  తానొక్కడే అచ్చ పుచ్చకాయ అనుకుని, మనల్ని సచ్చు, పుచ్చు, పిచ్చ, మచ్చ పుచ్చకాయలు క్రింద లెక్కేసిన స్వచ్ఛ తెలంగాణా పుచ్చకాయ గారిని గిచ్చలేం గనుక, లచ్చనంగా గచ్చు మీద అచ్చు బొమ్మ ఏసుకుని ఏమాత్రం ఎచ్చులకు పోకుండా ఇచ్చకాలాడుకుంటూ గచ్చకాయలాడటమొక్కటే తచ్చన కర్తవ్యమ్ !

  ReplyDelete
 9. Jai గారు. మీ సమాధానం బాగుంది. అయితే ఆపిల్ వాచీ లకు కూడా హక్కులుంటాయి. పేద వాళ్ళంతా నిజాయితీ పరులు ఉన్నవాళ్లు అందరూ దోచుకు తినేవాళ్ళు కారు.

  ఎప్పుడైనా వ్యాఖ్యలలో పొరపాటు చేయడం మానవ సహజం.

  అవసరమైతే వ్యాఖ్యలు సవరించు కోవడం తప్పుకాదేమో ఆలోచించండి.

  నేను గతం లో కూడా మిమ్మల్ని అడిగాను.

  మీరు ఆంధ్ర ప్రాంతం విషయాలపై నాయకులపై స్పందిస్తారు. కానీ కేసీఆర్ మీద నోరు విప్పరు ఎందుకు.

  కేసీఆర్ గారు సాధించిన ఎన్నో పథకాలు యాదాద్రి, కాళేశ్వరం, నిరంతర విద్యుత్తు, భగీరథ .. ఇవి గొప్ప విజయాలే.

  కానీ భైంసా అల్లర్లలో హిందువులపై దాడి, మతపిచ్చే ఓవైసీ తో అంట కాగడం, CAA వ్యతిరేకించడం పై మీరు స్పందించరు. నిశ్శబ్దంగా ఆమోదిస్తారా. ప్రస్తుత విషయం కాదని తప్పుకోకండి.

  నేను జగన్ అభిమానినే కానీ రాజధాని తరలింపు ఇప్పుడు చేయడం, శాసన మండలి రద్దు చర్యలు సరికాదు అనుకుంటున్నాను. ఒక వైపు పచ్చ మూకల ఉన్మాదం వల్ల జగన్ కూడా తప్పులు చేస్తున్నాడేమో అనిపిస్తుంది.

  ఏమైనా. Some feathers are ruffled among bloggers. మీరు, విన్నకోట గారు వ్రాసే వ్యాఖ్యల అభిమానిని నేను.

  నేను కూడా అప్పుడప్పుడు ఉపయోగం లేని పనికిరాని బుచికి వ్యాఖ్యాలు చేశాను అని చెప్పడానికి వెనుకాడను.  ReplyDelete
  Replies
  1. @GKK (జీ):

   ఎవరి హక్కులు వారికున్నాయి, ఎవరి హక్కులు హరించినా అందరమూ గళమెత్తాల్సిందే. రాజధాని వికేంద్రీకరణ/తరలింపు అంశంలో తుళ్లూరు "రైతులు" తమ *ప్రయోజనం* కోసం కొట్లాడుతున్నారని, అంతటి బలవంతులకు నా మద్దతు అనవసరమని నా అవగాహన.

   కెసిఆర్ నా తాత చుట్టమేమీ కాదు. అతడిని ఉద్యమ సందర్భంలో & ఆ తరువాత కూడా అనేక సార్లు ఘాటుగా విమర్శించాను. కాళోజీ అన్నట్టు "ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతరేస్తాం": కెసిఆర్ అయినా ఇంకెవడయినా.

   యాదగిరిగుట్ట గుడి మీద నాకు ఆసక్తి లేదు. భైన్సా గొడవల గురించి పెద్దగా తెలువదు. బండి సంజయ్ పరిణితి నేను అనుకున్న (ఆశించిన) విధంగా ఎదిగితే 2024 లో నా ఓటు బీజీపీకే.

   CAAకి నేను వ్యతిరేకం, నా అంచనా ప్రకారం ఇది ఆసాం తదితర ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలలో బెంగాలీ ఓటు బాంకు పుష్టీకరణ తప్ప వేరే కాదు.

   నాకొక్కడికే అన్నీ తెలుసనే అహంకారం నా వ్యాఖ్యలలో కనిపిస్తే మన్నించండి. నాకేమీ పెద్దగా తెలువదని, ఆ తెలిసిన కొద్ది పాటి విషయాలు కూడా ఇరానీ హోటల్ మిడిమిడి సరికాని నా ప్రగాఢ విశ్వసం. I apologize for ruffling feathers.

   Delete
  2. @jai,

   "ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతరేస్తాం"

   ఆంధ్రావాళ్ళు చేతలతో చేసి చూపిస్తారు..మీరు మరీ ఆయాసపడబోకండి.

   Delete
 10. >>>ఎవరి హక్కులు వారికున్నాయి, ఎవరి హక్కులు హరించినా అందరమూ గళమెత్తాల్సిందే. రాజధాని వికేంద్రీకరణ/తరలింపు అంశంలో తుళ్లూరు "రైతులు" తమ *ప్రయోజనం* కోసం కొట్లాడుతున్నారని, అంతటి బలవంతులకు నా మద్దతు అనవసరమని నా అవగాహన.>>>

  మీ మద్దతు అనవసరమని ఇకనైనా గుర్తిస్తే మేలు.

  ReplyDelete
 11. >>>బండి సంజయ్ పరిణితి నేను అనుకున్న (ఆశించిన) విధంగా ఎదిగితే 2024 లో నా ఓటు బీజీపీకే.>>>

  మీరు ఆశించినవిధంగా ఎదగడం అసాధ్యం. మీకు ఓటు హక్కు ఉందా అసలు ?

  ReplyDelete
 12. >>>CAA కి నేను వ్యతిరేకం, నా అంచనా ప్రకారం ఇది ఆసాం తదితర ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలలో బెంగాలీ ఓటు బాంకు పుష్టీకరణ తప్ప వేరే కాదు.>>>

  CAA ని వ్యతిరేకిస్తూ బీజేపీ కి ఓటువేస్తారా ?
  పుచ్చకాయ డైలాగ్స్ మీరూనూ ...

  ReplyDelete
 13. నీహారికా గారూ నమస్తే.

  ఆంధ్రుల పటిమ నాకు తెలుసండీ. కారంచేడు కాలం నుండే చూస్తున్నాం కదా.

  బండి సంజయ్ యువకుడు, బడుగు వర్గాల & మెట్ట ప్రాంత ప్రతినిధి, పైగా కింది స్థాయి నుంచి రాటుదేలి పైకొచ్చిన ఔత్సాహవంతుడు. బయటి పార్టీల దగ్గర అరువు తెచ్చుకున్న వాళ్లకు పోలిస్తే ఎన్నో రేట్లు నయం.

  నేను ఎప్పుడు ఎవరికి మద్దతు ఇవ్వాలో అప్పుడు చూస్తాను లెండి. అయినా ఎన్నికలకు ఇంకో ఐదేండ్లు, ఆసాం సమస్య ఎటు మలుపు తిరుగుతుందో.

  ReplyDelete
 14. జై గారు,
  @ “ భైన్సా గొడవల గురించి పెద్దగా తెలువదు.” @

  అవునవును, ఎప్పుడో 18వ శతాబ్దంలో ఆంధ్రాలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి ఏలుబడిలో జరిగిందంటున్న నరుకులపాడు చెంచుల ఊచకోత వృత్తాంతం బాగానే గుర్తుంది కానీ నిన్న మొన్న మీ తెలంగాణాలో జరిగిన భైంసా అల్లర్ల సంగతి మీకు తెలియదంటారు, అంతేనా? మరీ selective గా ఉన్నట్లు లేదూ?
  ——————-

  @ “ నాకేమీ పెద్దగా తెలువదని, ...” @

  మీ వినమ్రత (humility) కాస్త ఎక్కువైనట్లుండలా? మీకు చాలా అంశాలపై విషయపరిజ్ఞానం బాగానే ఉందన్న సంగతి బ్లాగులోకంలో అందరికీ తెలుసు 🙂.
  ———————

  మీ వ్యాఖ్య మీద ఇంతవరకే నేను చెప్పదలుచుకున్నది. తతిమ్మా విషయాల గురించిన చర్చలో పాల్గొనదలుచుకోలేదు. ఎందుకంటే ఆంధ్రా విషయాలకు సంబంధించినంత వరకు :-

  // “తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు / దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు / తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు / చేరి” జైగారి “మనసు రంజింపరాదు“ //

  అని ధృఢమైపోయింది నా దృష్టిలో. 🤘

  ReplyDelete
  Replies
  1. This comment has been removed by the author.

   Delete
  2. Posting again after correcting typo:

   విన్నకోట వారూ, భైన్సాలో వందలాది మందిని భోజనానికి పిలిచి మరీ ఊచకోత కోసా రాండీ? అల్లర్లకు బాధ్యులయిన వారిని శిక్షించాలని మీలాగే నేనూ కోరుకుంటున్నాను.

   నరుకులపాడులో హతమయిన చెంచులు తెలంగాణ వాళ్ళు, వాసి*రెడ్డి* వెంకటాద్రి నాయుడు ఒక్కడే ఆంధ్రుడా? ఇసుక నుండి తైలం తీసిన మహోన్నత ఆలోచనా పటిమ భేష్!

   Delete
 15. "CAA కు నేను వ్యతిరేకం, నా అంచనా ప్రకారం ఇది ఆసాం తదితర ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలలో బెంగాలీ ఓటు బాంకు పుష్టీకరణ తప్ప వేరే కాదు -

  మతోన్మాద దేశాలలో మత విద్వేషానికి గురై, చిత్రహింసలు అనుభవించి, శరణార్థులై తరలివచ్చి 70 ఏళ్లుగా జీవచ్చవాలు గా బతుకుతున్న హిందూ, శిక్కు, క్రిస్టియన్ కుటుంబాల వారికి సాంత్వన చేకూర్చే CAA చట్టం పట్ల మీ అభిప్రాయం చాలా విషాదకరం జై గారు.

  రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణా గడ్డ వాసిగా is this the empathy you have for our own people.

  Even though BJP economic policies may not be great, for the sake of existence of Hindus, we have to support BJP.

  All other political parties, sickular media, hostile academia, presstitutes every one is against Hindus.  మీరన్నట్లు బండి సంజయ్ నాయకుడుగా ఎదిగితే ఎంతో సంతోషం. భాజపా తెలంగాణాలో అధికారం లోకి రావాలని కోరుకుంటాను.

  How can you look the other way when KCR is aligning with communal fanatics.  ReplyDelete
  Replies
  1. GKK (జీ) గారూ,

   శరణార్థులు అస్సాం & ఈశాన్యం తప్ప ఇంకెక్కడున్నా నాకు అభ్యంతరం లేదండీ. ఇప్పటికే త్రిపుర & బరాక్ లోయలు బెంగాలీ మయమైపోయాయి, మత సమీకరణాల పేరిట ఇంకా నష్టం జరగరాదన్నదే నా అభిమతం.

   చరిత్ర పుటలు తిరగేస్తే, తెలంగాణా సాయుధ పోరాటం ప్రధానంగా భూస్వాములకు వ్యతిరేకం. రజాకార్ ఘట్టం షుమారు ఏడాది మాత్రమే.

   తెలంగాణా మిశ్రమ సంస్కృతిలో అన్ని మతాలకు స్థానం ఉందన్నది నా నమ్మకం. This is a salad bowl, not a melting point. లంబాడీలు, గోండులు, కోయలు, తురకలు, సెటిలర్లు, బొందిలీలు, కాయస్తోళ్లు వగైరాలు అందరూ కలిస్తేనే గంగా-జమునీ తెహజీబ్. Sorry for the politically incorrect language for these groups, I am continuing the "equal opportunity offender" approach.

   బీజేపీ మతరాజకీయాలు నాస్తికుడనయిన నాకు అనవసరం. ఒకప్పుడు రాజాజీ స్వతంత్ర పార్టీ ఎకనామిక్స్ సమర్తించిన బీజేపీ ఆ తరువాత కాలంలో ఎడమకు జరగడం బాధాకరం. మళ్ళీ కాస్త "స్వేచ్చా బజారు" వైపు మళ్లితే సంతోషం.

   కిషన్ రెడ్డి చేజేతులా చెడగొట్టుకున్న అవకాశాలు బండి సంజయ్ అందిపుచ్చుకోవాలని ఆశిస్తాను. He is starting on a clean slate without the baggage of outdated & outside leadership. All the best to this clean, young & fresh BC leader hailing from North Telangana.

   Delete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.